నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్…

రైల్వే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద ఖాళీగా ఉన్న 11558 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు తేదీలను కూడా ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్ 14 సెప్టెంబర్ 2024న అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inలో యాక్టివేట్ చేయబడుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే..అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. RRB కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13 అక్టోబర్ 2024గా నిర్ణయించారు.

ఈ రిక్రూట్‌మెంట్‌కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా..కొన్ని పోస్టులకు, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు, అభ్యర్థులు కంప్యూటర్/టైపింగ్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి

RRB NTPC రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు పోస్ట్ ప్రకారం..33/36 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు RRB నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇలా అప్లై చేసుకోండి

1. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి ముందుగా మీరు RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
3. దీని తర్వాత, మీరు మొదట రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
4. చివరగా మీరు నిర్ణీత రుసుమును కట్టి, పూర్తిగా నింపిన ఫారమ్‌ను సమర్పించాలి.

దరఖాస్తు రుసుము

ఈ రిక్రూట్‌మెంట్‌లో అప్లికేషన్‌తో పాటు..జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.500. ఇక ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Comment